కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడింది. మంగళూరు వైపు వెళ్తున్న ఆ బస్సు.. అగసుర్ గ్రామంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో హుబ్బళ్లికి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్రేన్ సాయంతో బస్సును పక్కకు లాగారు. అనంతరం తాళ్ల సాయంతో ప్రయాణికులను రక్షించారు. రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రిడ్జి గోడను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు.