అనంతపురం జిల్లాలోని కదిరిపల్లి టోల్ గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారుడికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.