తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ ప్రైవేట్ బస్సు ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ నెల 19న వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రిటైనింగ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. బస్సు కింద ఉన్న ఇనుప కడ్డీలు, దిమ్మెల మధ్య చిక్కుకోవడంతో నదిలో పడకుండా ఆగిపోయింది, ఫలితంగా భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఓ మోటో వ్లాగర్ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.