కన్నడ నటుడు దర్శన్ సిగరెట్ తాగిన ఘటనతో ఇప్పటికే చర్చలో ఉన్న బెంగళూరు సెంట్రల్ జైలులో భద్రతా లోపాలు మళ్లీ బయటపడ్డాయి. జైలులో ఖైదీలు ఫుల్లుగా మద్యం తాగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మరో వీడియో తాజాగా వైరల్ కావడంతో, ఈ కేంద్ర కారాగారంలో నిబంధనల ఉల్లంఘనలు, భద్రతా వైఫల్యాలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈ వరుస సంఘటనలు జైలు అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలు లేవనెత్తుతున్నాయి.