నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లులకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలను రూరల్ పోలీసులు అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాత్రి సమయంలో కొంతమంది అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్నారు. వాహన తనిఖీలలో భాగంగా అనుమతి లేని 11 ధాన్యం లారీలను పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదు. కానీ కొందరు దళారులు ఇతర రాష్ట్రాల్లో ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మిర్యాలగూడ సమీపంలోని పలు రైస్ మిల్లులో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.