హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులు ప్రస్తుత పరిస్థితుల్లో కబేలాలకు గోవధ నిమిత్తం రాష్ట్రాలు దాటి తరలిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సమీపంలో ఒరిస్సా మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్కు ఆవులను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. గత నెల రోజులుగా.. గోవులను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కో లారీలో 30 నుంచి 40 ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.