నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లిని పోలీసులు గుర్తించారు. నందికొట్కూరు మండలం కొణిదెలకు మహిళగా గుర్తించారు. ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే బిడ్డను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. చిన్నారికి తక్కువ బరువు, వెన్నెముక సమస్య ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం నంద్యాల జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీడీఎస్ సంరక్షణలో ఉంది.