అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ శివలింగం ధ్వంసం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. నిందితుడికి, ఆలయ ఉద్యోగులకు మధ్య ఉన్న పంట కాలువ స్థల వివాదమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆలయ పూజారిని నింద వేయాలని పక్కా ప్రణాళికతోనే, అర్ధరాత్రి సమయంలో శ్రీనివాస్ శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.