రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబొడలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే 150 మంది పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. ఇళ్లల్లో ఉంటున్న వారి వివరాలతో పాటు వారి వాహనాలు వివరాలపై ఆరా తీశారు. గతంలో ఇదే ప్రాంతంలో కొంతమంది గంజాయి తాగి స్థానికుల వాహనాలపై దాడులు చేయడంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు.