తూర్పుగోదావరి జిల్లాలో మధ్యప్రదేశ్‌కు చెందిన 'తార్ ముఠా' దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లజర్ల వద్ద మరో దొంగతనం చేయబోతుండగా సీఐ రాంబాబు ఆధ్వర్యంలో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 లక్షల నగదు, కారు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వృద్ధురాలిపై దాడి కేసులో నిందితులు అని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.