నాగర్ కర్నూల్ జిల్లా గంట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న పవన్ జైన్ అనే ఉపాధ్యాయుడిని డిఇఓ సస్పెండ్ చేశాడు. అతనిపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదయింది. పవన్ జైన్ చాన్నాళ్లుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించాల్సిన ఈ టీచర్.. సూటిపోటి మాటలు, వెకిలి చేష్టలు చేస్తూ బాలికలను అసభ్యకర రీతిలో మాట్లాడిస్తున్నాడు. గతంలో పలుసార్లు ఫిర్యాదు చేసినా అతడి తీరులో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.