చైనాలోని చాంగ్‌చున్‌లో ఓ యువకుడు వీడియో గేమ్‌లకు బానిసయ్యాడు. ఈ-స్పోర్ట్స్ హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకున్న అతను.. ఏకంగా రెండేళ్ల పాటు బయటకు రాకుండా గడిపాడు. ఇటీవల అతను ఖాళీ చేసి వెళ్ళాక రూమ్‌ను శుభ్రం చేయడానికి వెళ్ళిన సిబ్బందికి.. గది మొత్తం సుమారు 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు తిన్న ఆహార పొట్లాలు, కూల్ డ్రింక్ బాటిళ్లు, ఉపయోగించిన టిష్యూ పేపర్లు కనిపించాయి.