మహా కుంభమేళాలో రెండు రోజుల కిందట బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పుణ్యస్నానం ఆచరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. ఒకవైపు కత్రిన పుణ్యస్నానం ఆచరిస్తుండగా మరోవైపు వీరంతా సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో తాజాగా బయటికొచ్చింది. పవిత్ర కార్యక్రమంలో సెలబ్రిటీల కోసం అభిమానులు ఇలా ఎగబడటంపై విమర్శలు వస్తున్నాయి.