ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. అదే 'చాయ్ 3.0'. కనిగిరి మున్సిపాలిటీలోని శివనగర్ కాలనీ స్థానికులతో కలిసి చాయ్ తాగుతూ మాట్లాడారు. ప్రజల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనుల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. వార్డు అంతా తిరుగుతూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే టీడీపీ నియమించిన కుటుంబ సాధికార కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.