కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన పలువురికి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. 38 మంది లబ్దిదారులకు 29 లక్షల 30 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.