అందరికీ కష్టం అనిపించే పనులు.. కొందరికి ఎంతో ఈజీగా అనిపిస్తుంటాయి. అలాగే అందరికీ సాధ్యం కాని పనులను కొందరు ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. ఇంకొందరైతే చిన్న చిన్న టెక్నిక్‌లతో అద్భుతాలు చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఓ వ్యక్తి.. ఫోన్ వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. పేరుకే పేషెంట్. తెలివి మామూలుగా లేదుగా. అంటూ కామెంట్లు చేస్తున్నారు.