తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో ఆర్టీసీ బస్సులో చోరీకి పాల్పడ్డ మహిళను ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు... కొయ్యలగూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్న మహిళ , పక్కనే ఉన్న మహిళ ప్రయాణికురాలు బ్యాగ్ ను కోసివేసి అందులోని రెండున్నర కాసుల బంగారు నగలు, 3 వేల రూపాయల నగదును కాజేసింది.. అయితే తన బ్యాగు చోరీకి గురైనట్లు గ్రహించిన మహిళ బస్సులో కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులంతా కలిసి పోతవరం గ్రామంలో బస్సును నిలిపివేసి తనిఖీలు చేశారు.. అనుమానాస్పదంగా ఉన్న మహిళలను గుర్తించి ఆమెని తాళ్లతో కట్టివేసి బ్యాగును పరిశీలించారు.. ఆమె బ్యాగ్ లో నగదు బంగారం కనిపించడంతో ఆమెను తీసుకుని వెళ్లి నల్లజర్ల పోలీసులకు అప్పగించారు.