ఉత్తర కాశ్మీర్లోని ఉరిలో ఉన్న సలామాబాద్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలోని అనేక ఇళ్లు షెల్లింగ్ కారణంగా భారీగా దెబ్బతిన్నాయని, కుటుంబాలు భయంతో పారిపోవాల్సి వచ్చిందని స్థానిక అధికారులు నివేదించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో కాలిపోయిన గోడలు , పగిలిన కిటికీలు కనిపిస్తున్నాయి.