ఆదివారం ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన భారత్-పాకిస్తాన్ మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్లో ఒక వింత సంఘటన జరిగింది. పురుగులు మైదానాన్ని చుట్టుముట్టడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు తాత్కాలికంగా ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత కెప్టెన్ ఫాతిమా సనా పురుగులపై ఒంటరి పోరాటం చేసింది.