ఒరిస్సా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహు అలియాస్ గీతా సాహును తెలంగాణ ఎస్టీఎఫ్ బృందం అరెస్టు చేసింది. నాలుగేళ్లుగా గంజాయి వ్యాపారంలో ఉన్న ఆమె సికింద్రాబాద్ రైల్వేలో ఒకటి, ధూల్‌పేట్‌లో నాలుగు కేసుల్లో నిందితురాలు. భువనేశ్వర్ సమీపంలో ఉంటూ వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశంతో ప్రత్యేక టీమ్ ఆమెను పట్టుకుని తెలంగాణకు తీసుకొచ్చింది.