ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి చేసింది. కీవ్‌లోని నివాస ప్రాంతంపై క్షిపణులు, డ్రోన్లలను ప్రయోగించింది. ఈ దాడిలో 14 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా ఈ దాడి చేసింది. రష్యా ప్రయోగించిన డ్రోన్ ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌ను తాకింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో 14 మంది మరణించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు