సంగారెడ్డి జిల్లాముదిమాణిక్యం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా అర్థరాత్రి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు పాఠశాల ఆయమ్మ గుర్తించింది. రోజులాగే ఉదయం పాఠశాలను శుభ్రం చేసేందుకు వచ్చిన ఆయమ్మ క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు వేసి ఉండడంతో భయాందోళనలకు గురై గ్రామస్తులకు సమాచారం అందించింది. పాఠశాల ప్రధాన గేట్ లోపల క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు ఉండడంతో గేటు తాళం తీసి పాఠశాల లోనికి వెళ్లేందుకు విద్యార్థులు భయపడ్డారు. ప్రిన్సిపల్ మాధవరెడ్డి ఇవన్నీ మూఢనమ్మకాలని, ఇలాంటి వాటిని నమ్మవద్దు అని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుపుతూ పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్న ముగ్గును కాలితో చెరిపేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.