కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. స్థానిక వెంకటేశ్వర ఆలయం వెనుక ఉన్న ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. ఇంటి ముందు టెంకాయ, పసుపు, నిమ్మకాయల, కుంకుమ చల్లి పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న ముగ్గురు విద్యార్థులు ఇంటి బాడుగాకు ఉండి డిగ్రీ చదువుతున్నారు. విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.