వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. ఇల్లంద సబ్ స్టేషన్ నుంచి కట్రియాల వెళ్ళే రహదారి పక్కన చెట్ల పొదల్లో ముగ్గువేసి దీపం వెలిగించి అన్నం వేసి ఏదో జంతువును బలి ఇచ్చారు. అంతేకాక అక్కడ రక్తం పోసి వివిధరకాల పూజలు నిర్వహించారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే స్థానికులు క్షుద్రపూజలను గుర్తించి.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. తమ గ్రామంలో క్షుద్రపూజలు జరగడంపై గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.