శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నల్లచెరువు మండల కేంద్రంలో తరచుగా క్షుద్ర పూజలు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు.. క్రికెట్ స్టేడియం, జెడ్పీ హైస్కూల్, షాపులు, ఇంటి ముందర రాత్రి వేళల్లో వచ్చి.. పసుపు, కుంకుమ, పిండితో విచిత్రమైన బొమ్మలు వేసి పూజలు చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు.