ములుగు జిల్లా వెంకటాపురం నూగురు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మందుబాబులకి అడ్డాగా మారింది. ధాన్యం తీసుకొచ్చే రైతులు యార్డ్ లోపలికి వెళ్సేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మద్యం సీసాలను మందుబాబులు మార్కెట్ యార్డ్లో పగులగొడుతుండడంతో.. ధాన్యం ఆరబోసేందుకు వెళ్తున్న రైతుల కాళ్లకు గాయాలవుతున్నాయి. మార్కెట్ యార్డ్లో ఒఖ వాచ్మెన్ కూడా లేడని.. తామే ధాన్యానికి కాపాలా ఉంటున్నామని రైతులు వాపోతున్నారు.