మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట వై-జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై.. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా చెక్పోస్ట్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన అధికారులు.. వాటికి సంబంధించి ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రేడియం రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా స్పీడ్ బ్రేకర్లను గమనించక అకస్మాత్తుగా ఆగిన ఓ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇలాంటి చోట్ల పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.