ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చీకటి అలుము కుంది. మూడుగంటలకు పైగా కరెంట్ లేక పోవడంతో సిబ్బంది, రోగులు చీకట్లోనే తీవ్ర అవస్థలు పడ్డారు. జనరేటర్ లేకపోవడంతో కరెంట్ పోయినప్పుడల్లా చీకట్లో ఉండాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఈ ఆసుపత్రికి రావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందేనని.. సరైన సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ చికిత్సలందడం లేదని చెబుతున్నారు. ఇక డాక్టర్లు కూడా మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.