లండన్‌లో పెరిగిన భారత సంతతికి చెందిన 9 ఏళ్ల అర్బన్ నేగి, తన ప్రతిభతో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజాలను ఆకర్షించాడు. అద్భుతమైన డ్రిబ్లింగ్, బాల్ కంట్రోల్ నైపుణ్యాలతో, ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్‌కు ఆడటానికి సిద్ధమయ్యాడు. దీనికోసం అతడు ఎవర్టన్ ఎఫ్‌సీ అకాడమీలో అధికారికంగా స్థానం దక్కించుకున్నాడు. ఏడేళ్ల నుంచే నేగి ఫుట్‌బాల్ ఆడుతూ తన ప్రతిభను చాటాడు.