సన్నగా ఎత్తుగా ఉన్న గోడలాంటి నిర్మాణం ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు ఈ గోడ ఇక్కడ ఎందుకు కట్టారో అనుకుంటూ ముందుకువెళ్లి చూసిన వారికి ఆశ్చర్యం కలగమానదు. ముందునుంచి చూస్తే అదొక ఇల్లు. బిహార్లోని ఖగాడియా జిల్లాలో ఉన్న ఈ నివాసం గురించి ఓ స్థానిక మీడియా పెట్టిన పోస్టు చూసి, నెటిజన్లు అవాక్కవుతున్నారు.