నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో భారీగా నీరు చేరి తడిసి ముద్దైన ధాన్యం. ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా కింది నుంచి నీరు చేరడంతో తడిసి పోయిందంటూ ఆవేదన. ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్న అన్నదాతలు