బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 చిత్రం భారీ విజయవంతం కావాలని కోరుతూ ఏపీలోని అన్ని పంచారామ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆల్ ఇండియా అఖిలభారత నందమూరి బాలకృష్ణ ఫాన్స్ కన్వీనర్ నంబూరి తిలక్ అన్నారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో సోమేశ్వర జనార్దన స్వామికి తిలక్‌తో పాటు, అభిమానులు, తెలుగుదేశం నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. అఖండ కంటే అఖండ 2 సినిమా మరింతగా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.