కర్రెగుట్టలపై తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్లో భాగంగా 10 వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెలగుట్టను చుట్టుముట్టారు.