వారానికి 70 గంటల పనిపై మాట్లాడిన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి. తాను గత 40 ఏళ్లుగా ఉ.6:30 నుంచి రా.8:30 వరకు పని చేస్తున్నానని చెప్పారు. ఒక వ్యక్తి పూర్తిగా ఆత్మపరిశీలన చేసుకున్నాకే ఏం చేయాలో నిర్ణయించుకోవాలని, అది ఒకరు చెప్పేది కాదన్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే