ములుగు జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతలు కారణంగా జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లిపోయింది. ఉదయం 9 దాటినా చలి తీవ్రత ఉండడంతో.. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రోడ్లపై వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.