కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తూ జనగామ కలెక్టరేట్‌కు వెళ్లింది. ఎవరూ స్పందించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. '4000 పెన్షన్ డైవర్లకే సరిపోవట్లేదు. ఇందిరమ్మ ఇల్లు, జీరో కరెంటు బిల్లు రావట్లేదు. కూలీ పనులకు వెళ్లే మేం పథకాలకు అర్హులం కాదా. మమ్మల్ని ఆదుకోండి లేదా నా కొడుకును చంపేయండి' అని లక్ష్మి అనే మహిళ రోదించింది.