జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వీధికుక్క చనిపోగా, తల్లి మృతదేహం దగ్గర కుక్క పిల్లలు రోదించిన ఘటన స్థానికులను కదిలించింది. ఆకలితో అలమటిస్తున్న కుక్కపిల్లలు.. తల్లి మృతదేహం దగ్గర పాలు తాగేందుకు ప్రయత్నించాయి. స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని కుక్క కళేబరాన్ని మున్సిపల్ వాహనంలో తరలించారు. .తల్లి కళేబరాన్ని అక్కడి నుండి తరలిస్తుండడంతో ఆ కుక్క పిల్లలు బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచక ఉండిపోయాయి. రోడ్డు ప్రమాదావల్ల కలిగే విషాదం మనుషులకైనా.. జంతువులకైనా ఒక్కటేనని రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని ప్రజలు కోరుతున్నారు.