సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి భుజాలపై వానరం కూర్చొని ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంగారెడ్డి మండలం ఈరిగిపల్లికి చెందిన బుచ్చిరాములు బైక్పై గ్రామానికి వెళుతున్న సమయంలో.. ఒక్కసారిగా వచ్చిన కోతి ఆయన భుజాలపై కూర్చొంది. బుచ్చిరాములు అలాగే చాలా దూరం వాహనం నడుపుతూ వెళ్లడంతో.. స్థానికులు వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.