ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మోడ్రన్ హరిదాసులు సందడి చేశారు. సాధారణంగా హరిదాసులు నడుచుకుంటూ ఇంటింటికి తిరుగుతారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో హరిదాసులు ఇప్పుడు ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి వరకు హరిదాసులు ఇంటింటికి వచ్చి దానధర్మాలు స్వీకరిస్తారు. ప్రస్తుతం హరిదాసులు కనుమరుగయ్యే పరిస్థితుల్లోనూ.. ఉన్న వృత్తిని వదులుకోలేక ఇలా స్కూటర్‌పై వస్తున్నామని హరిదాసు వెంకటేశ్వర్లు తెలిపారు.