ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భక్తులకు, ఆలయ సిబ్బందికి అవగాహన కల్పించేలా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన మాక్ డ్రిల్ రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు చేపట్టారు. ఈ డ్రిల్‌ను ఉగ్రవాద నిరోధక దళం ఆక్టోపస్ ఆధ్వర్యంలో నిర్వహించగా దేవస్థానం భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.