మన కడప స్వచ్చ కడప కార్యక్రమంలో 28వ డివిజన్లో పర్యటిస్తున్న కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ ఆవరణలో అనుమతి లేని వాహనాలు ఉండడంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులు ట్యాంకర్లతో వస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. పార్కింగ్ చేయకుండా అడ్డుకుంటుంటే దాడి చేసేందుకు వస్తున్నారని సిబ్బంది చెప్పడంతో.. బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు.