నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి, దాస్తురాబాద్ మండలాల్లో మహిళా గ్రూపులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడానికి,వారి సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పష్టం చేశారు.