ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని ప్రముఖ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సందర్శించారు. ఆలయానికి చేరుకున్న తుమ్మలకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలు సమర్పించి స్వామివారి చిత్రపటం బహుకరించారు.