హైదరాబాద్‌లో రాయదుర్గంలో అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ డాయిష్ బోర్స్ గ్రూప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా హైదరాబాద్ ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్‌గా ఉన్న డాయిష్ బోర్స్ గ్రూప్ హైదరాబాద్‌ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పటిష్ఠమైన పాలసీలు, స్థిరత్వం, ఇక్కడి టాలెంట్ పూల్‌పై గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.