భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7 శాతం వరకు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భోగాపురం ప్రాజెక్ట్ ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన... సీఎం చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక సవాలుగా స్వీకరించి, ఎదురైన ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తూ పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.