కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరు గ్రామానికి చెందిన నివేదిత ఆదోని KGBV పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అయితే విద్యార్థి నివేదిత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. నివేదిత తల్లిదండ్రులు ఎమ్మిగనూరు కేజీబీవీలో చేరడానికి DEO రిఫర్ ద్వారా మార్చుకున్నారు. అయితే DEO ఆదేశాలను లెక్కచేయని ఎమ్మిగనూరు కేజీబీవీ GCDOను సీటు ఇవ్వాలని ప్రాధేయపడినా ఆమె చలించలేదు. ప్రస్తుతం బాలికను తల్లిదండ్రులు విద్యార్ధిని చదువు మాన్పించి తమతో పాటు వ్యవసాయ కూలీ పనులకు తీసుకెళుతున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించి తమ బిడ్డ నివేదితకు ఎమ్మిగనూరు లో సీటు కేటాయిస్తే చదువుకుంటుందని తెలిపారు..