కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు రూ.21 లక్షల విలువైన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో చింతలమానేపల్లి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..స్టేషన్లో నిల్వ చేశారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.