గూడూరు ప్రాంతాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపడంపై స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కటౌట్లకు డ్రోన్ ద్వారా వినూత్నంగా పాలాభిషేకం చేశారు.