జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఆలయాల్లో అర్ధరాత్రులు చోరీ ఘటనలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న అక్కపెళ్లి రాజరాజేశ్వరస్వామి ఆలయంతో పాటు,మరో అనుబంధ ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయ గేట్ తాళాలు పగలగొట్టి, ఆలయంలోని శివుడి పానవట్టంపైన ఉన్న వెండి ఆభరణాలతో పాటు, మరో ఆలయంలోఅమ్మవారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు, తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. సుమారు కిలోన్నర విలువైన వెండి ఆభరణాలు చోరికి గురైనట్లు బావిస్తున్నారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది.