నిర్మల్ జిల్లాలో సోయా టోకెన్ల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాత్రి నుంచే పంపిణీ కేంద్రాల వద్ద ఎదురు చూపులు చూస్తున్నారు. టోకెన్లు పంపిణీ చేస్తారన్న సమాచారంతో ముధోల్ మండలం బోరిగావ్ గ్రామంలోని PACS కార్యాలయానికి రాత్రే రైతులు చేరుకున్నారు. రాత్రంతా చలిలో అక్కడే ఉండి, క్యూ లైన్లలో చెప్పులు, రాళ్లు పెట్టి నిద్రపోయారు. అర్థరాత్రి నుంచే పడిగాపులు కాశారు. ప్రభుత్వం 5,328 కొనుగోలు ధర ప్రకటించడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. పంట వేసినప్పటి నుంచి అమ్ముకునే వరకు రైతులు పడుతున్న కష్టాలకు తాజా ఘటనలు నిదర్శనంగా మారుతున్నాయి.